మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, ఎస్డీసీ మాధవకృష్ణారెడ్డితో కలిసి అర్జీలను పరిశీలించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి, నిర్ణీత గడువులోపు అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెన్ కేసులు లేకుండా నాణ్యతతో అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా బీకేపల్లికి చెందిన వై. రామక్క ఇంటి స్థలం, గృహం మంజూరు చేయాలని,
నిమ్మనపల్లెకు చెందిన దివ్యాంగుడు మేకల కిష్టప్ప విద్యుత్ మోటార్ వాహనం ఇవ్వాలని,
కురబలకోట మండలం తట్టేవారిపల్లికి చెందిన జి. అమరావతి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం,
వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వినతులు సమర్పించారు. కార్యక్రమంలో మొత్తం 332 అర్జీలు అందగా, వాటిని పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు.
Tags: PGRS grievances must be resolved with quality to instill confidence in the public: JC