పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని గూడూరుపల్లె సమీపంలో ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటో బోల్తా పడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు . సోమవారం కపాడంమిట్టపల్లెకి చెందిన సుబ్రమణ్యం(45) తన ఆటోలో పుంగనూరుకు వెళ్తుండగా ఎదురుగా ట్రాక్టర్ వచ్చి ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి 108లో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Tractor hits auto-rickshaw – one injured