June 29, 2026
Explore
కరాటేలో చిన్నారులకు పథకాలు

కరాటేలో చిన్నారులకు పథకాలు

June 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులకు కరాటే పోటీలలో బంగారు, వెండి పథకాల లభించింది. సోమవారం మార్షల్‌ఆర్ట్ అకాడమి చైర్మన్‌ మహేష్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో 6వ ఏపి కరాటే ఛాంపియన్‌షిఫ్‌ పోటీలు జరిగాయి. ఇందులో పట్టణానికి చెందిన జ్ఞానవికాస్‌ , శ్రేష్ఠ, షేక్‌జహాఫాతిమా లకు బంగారు పథకాలు కైవసం చేసుకున్నారు. త్రివిక్రమ్‌, షాహాంత్‌, ఏవి.లక్ష్మీ, హితేష్‌నాయుడు లకు వెండి పథకాలు లభించింది. అలాగే బహులేయ, రుత్విచ్‌, నిహారిక, చర్వీక్‌, యోహిత్‌, ఆర్యన్‌ లకు కాంస్య పథకాలు లభించాయి. వీరిని శ్యాప్‌చైర్మన్‌ రివినాయుడు, ఏపి కరాటే అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కోలాప్రతాప్‌ తదితరులు చిన్నారులకు పథకాలు పంపిణీ చేసి అభినందించారు.

Tags: Medals for children in karate