June 29, 2026
Explore
ఎస్‌ఐఆర్‌ను నిర్లక్షం చేయరాదు

ఎస్‌ఐఆర్‌ను నిర్లక్షం చేయరాదు

June 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమంలో ప్రతి ఓటరు తమ ఓట్లను పరిశీలించుకోవాలని , నిర్లక్షం చేయవద్దని లేకపోతే తీవ్ర కష్టనష్టాలు తప్పవని వైఎస్సార్‌సిపి జిల్లా మైనార్టీ సెల్‌ కార్యదర్శి కిజర్‌ఖాన్‌ తెలిపారు. సోమవారం ఆ యన పట్టణంలోని సుబేదారువీధి, సుల్తాన్‌సాబ్‌వీధి, నానబాలవీధి ప్రాంతాలలో ఎన్యూమరేషన్‌ ఫారాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అలాగే మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా , జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము , మిధున్‌రెడ్డి యువసేన కార్యదర్శి జయకృష్ణ కలసి కొత్తపేట, చౌడేపల్లె రోడ్డు ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు. వీరందరు బిఎల్‌ఏ, బిఎల్‌వోలతో కలసి ఓటర్ల పరిశీలన చేపట్టి, డిజిటల్‌ ఆన్‌లైన్‌ చేయించారు. కిజర్‌ఖాన్‌ మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రమైన పుంగనూరు పై రాష్ట్రమంత దృష్టి సారించిందన్నారు. ప్రతి వార్డులోను కూటమి ప్రభుత్వం తమ శక్తి మేరకు ఓట్లు లేకుండ చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సిపి శ్రేణులు ఐకమత్యంతో ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిశీలన చేయించి, ఓట్లు కోల్పోకుండ చూడాలని కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు ఆర్థర్‌పాల్‌, లక్ష్మణరాజు ,అజిజ్‌, బాలు, బావాజాన్‌, యూనస్‌, హరీష్‌, అన్సర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: SIR should not be neglected.