June 29, 2026
Explore
మంగంపేట సభకు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రకటించిన పోలీసులు

మంగంపేట సభకు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రకటించిన పోలీసులు

June 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో జూలై 2న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయని తిరుపతి జిల్లా పోలీసులు తెలిపారు.

తిరుపతి నుంచి కడప వెళ్లే వాహనాలు రైల్వేకోడూరు–చిట్వేలి–బెస్తపల్లి–రాజంపేట NTR సర్కిల్ మీదుగా వెళ్లాలని, కడప నుంచి తిరుపతి వచ్చే వాహనాలు రాజంపేట–బెస్తపల్లి–చిట్వేలి–రైల్వేకోడూరు మార్గాన్ని వినియోగించాలని సూచించారు. పుల్లంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు ఓబులవారిపల్లి క్రాస్–చిన్న వూరంపాడు–వైకోట మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి, ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags; Traffic restrictions for the Mangampet meeting; police announce alternative routes.