June 29, 2026
Explore
పల్నాడు జిల్లాలో 8 మంది BLOలకు షోకాజ్ నోటీసులు..!

పల్నాడు జిల్లాలో 8 మంది BLOలకు షోకాజ్ నోటీసులు..!

June 29, 2026 | Andhra Pradesh

పల్నాడుముచ్చట్లు:

బొల్లాపల్లి మండలంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది బూత్ లెవల్ అధికారులకు (BLOలు) షోకాజ్ నోటీసులు జారీ.

కండ్రిక, పేరూరిపాడు, రేమిడిచర్ల, గుమ్మనంపాడు, లాలిపురం గ్రామాల పరిధిలోని పలు బూత్‌లకు చెందిన BLOలు ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలను ఇంటింటికీ అందించి పూర్తి వివరాలు సేకరించడంలో అలసత్వం ప్రదర్శించినట్లు గుర్తింపు.

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు బొల్లాపల్లి తహసీల్దార్ సుధాకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Tags: Show-cause notices issued to 8 BLOs in Palnadu district!