రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణ పరిధిలోని గొల్లపల్లి క్రాస్–గాలివీడు రోడ్డులో వరిగ క్రాస్ సమీపంలో శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రెండు కార్లు బోల్తా పడగా, వాటిలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags: Two cars overturn near Rayachoti; several sustain severe injuries.