తీరా తిరిగిమ్మని అడ్డగ్గా.. ఇది పరిస్థితి!…డబ్బులు ఇవ్వమాకండి దయచేసి!
తెలిసిన వారే కదా.. ఆపదలో ఉన్నారని ఆదుకున్న ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది.
ఆమెకు తెలియకుండానే ఆమె వీడియోలు రికార్డ్ చేసిన దుండగులు.. తమకు న్యూడ్ కాల్స్ చేయకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ.. రివర్స్‌లో ఆమెనే బ్లాక్‌మేల్ చేయడం ప్రారంభించారు.
బంధువులని నమ్మి డబ్బులు ఇస్తే ఇంత మోసం చేస్తారా అని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ ముచ్చట్లు:
విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ టైలరింగ్ ద్వారా వచ్చిన డబ్బును రొటేషన్ చేస్తూ ఆర్థికంగా ఎదుగుతోంది. అయితే ఈ విషయం ఆమె సమీప బంధువులైన చొక్కర అశోక్, వండ్రాసి శంకర్ అనే ఇద్దరు వ్యక్తులకు తెలిసింది. దీంతో తాము కష్టాల్లో ఉన్నామని.. కొంత నగదు సాయం చేయాలని.. తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమెను నమ్మబలికారు. వారి మాటలు నిజమేనని నమ్మిన ఆమె.. 2018లో వారికి రూ. 21 లక్షల నగదును అప్పుగా ఇచ్చింది.
రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి.. కానీ వాళ్లు తీసుకున్న డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో ఓ రోజు ఆమె డబ్బులు తిరిగి ఇవ్వాలని అశోక్, శంకర్‌లను అడిగింది. సరే విజయవాడకు వచ్చి డబ్బు తీసుకెళ్లమని సదరు మహిళకు చెప్పారు ఆ ఇద్దరు కేటుగాళ్లు. తీరా ఆమె అక్కడికి వెళ్లాక.. ఆమె వ్యక్తిగత వీడియోను ఆమెకే చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడిలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు.
అంతేకాకుండా, బాధితురాలి వాట్సాప్ నంబర్‌కు అసభ్యకర వీడియోలు పంపడంతో పాటు, వాట్సాప్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేసి, బాధితురాలిని కూడా అలాంటి వీడియో కాల్ చేయాలని బలవంతపెట్టారు. ఒకవేళ అలా చేయకపోతే.. తన వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఏం చేయాలో తెలియక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా చెప్పి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. అశోక్, శంకర్రావులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Tags: She blindly trusted them—thinking they were relatives—and handed over ₹21 lakhs.