దక్షిణాది ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదికలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-2024’ ప్రకారం.. జాతీయ సగటు 5.4% కాగా, తమిళనాడు 11.6%, కేరళం 10.4%తో ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 8.0%, తెలంగాణ లో 7.6% మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఒంటరి పురుషుల కంటే మహిళల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. ఒంటరి మహిళల సామాజిక భద్రత, వృద్ధాప్య రక్షణపై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Tags; Rising number of single women in the South!