June 13, 2026
Explore
బీహార్” ఆ మజాకానా.. 132 అడుగుల మొబైల్‌ టవర్‌ మాయం

బీహార్” ఆ మజాకానా.. 132 అడుగుల మొబైల్‌ టవర్‌ మాయం

June 13, 2026 | Andhra Pradesh

బీహార్ ముచ్చట్లు:

!! బీహార్ లో ఓ వింత చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాధారణంగా ఆభరణాలు, నగదు, వాహనాలు మాయం కావడం చూస్తుంటాం. కానీ బక్సర్ జిల్లాలో ఏకంగా 132 అడుగుల మొబైల్ టవర్‌తో పాటు జనరేటర్ కూడా కనుమరుగవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.దుమ్‌రావ్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహాయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

2010లో బక్సర్‌కు సమీపంలోని దుమ్‌రావ్‌లో ఓ ప్రైవేటు టెలికాం సంస్థ ఈ టవర్‌ను ఏర్పాటు చేసింది. అందుకోసం స్థలం యజమాని హరేనాథ్ యాదవ్‌తో 12 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందం 2022తో ముగిసింది. ఆ తర్వాత నుంచి యజమానికి సంస్థ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. పలుమార్లు నోటీసులు పంపినా స్పందన రాలేదని సమాచారం. టవర్‌తో పాటు జనరేటర్ మాయం

ఇటీవల మరమ్మతుల కోసం అక్కడికి వచ్చిన కంపెనీ ప్రతినిధులు టవర్‌తో పాటు జనరేటర్ కూడా కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానికుల మాట వేరేలా ఉంది. టవర్ అక్కడ చాలా కాలంగా ఉందని, గత 15-20 రోజులుగా మాత్రమే అది కనిపించడం లేదని వారు చెబుతున్నారు. దీంతో ఈ మాయం వెనుక ఉన్న పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారాయి.ఈ ఘటన ఎవరు, ఎలా చేశారు అన్న దానిపై విచారణ కొనసాగుతోందని జిల్లా పోలీసులు తెలిపారు. స్థలం యజమానిని కూడా ప్రశ్నించనున్నట్లు చెప్పారు. ఒప్పంద గడువు ముగిసిన తర్వాత చెల్లింపుల వివాదం కొనసాగడం, ఆపై టవర్‌నే కనిపించకుండా పోవడం ఇప్పుడు బక్సర్‌లో చర్చనీయాంశంగా మారింది. బిహార్‌లో మరో విచిత్ర ఘటనగా ఇది నమోదైంది.

Tags; Bihar is no joke… 132-foot mobile tower vanishes.