పశ్చిమాసియాముచ్చట్లు:
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూసేందుకు డీజిల్ రిటెయిల్ విక్రయాలపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఒక వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు సాధారణ బంకుల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. వీరంతా తమ అవసరాల కోసం సొంతంగా ఉన్న కన్జూమర్ పంప్స్ ద్వారానే ఇంధనాన్ని సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది.
సాధారణ రిటెయిల్ ధరలకు, వాణిజ్య (బల్క్) ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ఈ ఆంక్షలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఉదాహరణకు ఢిల్లీలో లీటర్ డీజిల్ రిటెయిల్ ధర రూ.95.20 కాగా, బల్క్ ధర రూ.134.50 గా ఉంది. ఈ ధరల వ్యత్యాసం వల్ల టెలికాం టవర్లు, ఫ్యాక్టరీలు, జనరేటర్ల నిర్వాహకులతో పాటు ప్రైవేట్ బస్సులు, ట్రక్కుల కంపెనీలు కూడా మార్కెట్ రేటుకు కాకుండా సాధారణ పెట్రోల్ బంకులను ఆశ్రయించడం మొదలుపెట్టాయి. పైగా ప్రైవేట్ బంకుల్లో ధరలు ఎక్
Tags; From now on, only 200 liters of diesel per person…