చౌడేపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలంలోని అంకాలమ్మకొండ సమీపంలో చిరుత సంచరిస్తుండటంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.నూనిముద్దలపల్లె అంకాలమ్మ కొండ వద్ద కలాచ్చమ్మ బావి క్వారీ సమీపంలో చిరుత కనిపించినట్లు రైతులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎఫ్‌బీఓ ప్రభాకర్ అడుగుజాడలను పరిశీలించారు. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కర్రలు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఇదే ప్రాంతంలో ఆరు నెలల క్రితం చిరుత ఓ ఆవుదూడను చంపిన విషయం స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
Tags: Leopard movement near Ankalammakonda; farmers worried.