June 13, 2026
Explore
డ్రైవర్ దారుణ హత్య.. అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం

డ్రైవర్ దారుణ హత్య.. అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం

June 13, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అక్కుపల్లి వంశీ (25) హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ నెల 10న యజమాని చింతా రామసుబ్బారెడ్డితో బయటకు వెళ్లిన వంశీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు రెండు రోజుల తర్వాత ఒంటిమిట్ట మండలం సాలాబాద్ సమీప అటవీ ప్రాంతంలో వంశీ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో ఇది హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: Driver brutally murdered; body found in forest area.