June 13, 2026
Explore
ప్రైవేట్ ప్రాథమిక చికిత్స కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు

ప్రైవేట్ ప్రాథమిక చికిత్స కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు

June 13, 2026 | Andhra Pradesh

సుండుపల్లె ముచ్చట్లు:

సుండుపల్లెలో నిర్వహిస్తున్న ప్రైవేట్ ప్రాథమిక చికిత్స కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఫర్హా ఖానం, డాక్టర్ దిలీప్ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో కేంద్రాలు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. ప్రైవేట్ చికిత్స కేంద్రాల్లో RMPలు అందిస్తున్న వైద్య సేవలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా పలువురు నిర్వాహకుల వద్ద ప్రభుత్వ గుర్తింపు పొందిన శిక్షణా సర్టిఫికెట్లు లేవని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. రోగులకు అందిస్తున్న చికిత్స విధానాలపై కూడా ఆరా తీశారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికను జిల్లా అధికారులకు పంపనున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Tags: Surprise inspections of private primary care centers