June 13, 2026
Explore
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు

June 13, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్ట లోని వెలుగు సంస్థలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. బొమ్మనచెరువు వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వృద్ధులు, సిబ్బందికి టీబీ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా 70 మందికి ఛాతీ ఎక్స్‌రేలు తీశారు. ఈ సందర్భంగా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించిన అధికారులు, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. శిబిరం నిర్వహించిన వైద్య బృందానికి వెలుగు సంస్థ సెక్రటరీ ఎం. ఉదయమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Tags: X-ray tests conducted for 70 people as part of the TB-Mukt Bharat Abhiyaan.