June 13, 2026
Explore
అన్నమయ్య: మీరు గ్రేట్ సార్..!

అన్నమయ్య: మీరు గ్రేట్ సార్..!

June 13, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న చిన్నారుల జీవితాల్లో విద్య వెలుగు నింపేందుకు పెద్దమండ్యం ఎంఈవో మనోహర్ చొరవ చూపారు. కొటాలకు చెందిన రవి తన ముగ్గురు కుమార్తెలతో చెట్టు కింద నివాసం ఉంటూ భిక్షాటన చేస్తుండగా, ఆధార్ కార్డులు లేక పిల్లలు పాఠశాలకు దూరమయ్యారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మనోహర్, కొటాల పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి కళ్యాణి, జ్యోతి, లక్ష్మి అనే చిన్నారులను పాఠశాలలో చేర్పించారు. చిట్టి చేతుల్లో పలక, బలపం పెట్టించి వారి భవిష్యత్తుకు బాటలు వేశారు. ఈ చిన్నారుల జీవితాల్లో విద్య కొత్త వెలుగులు నింపాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

Tags: Annamayya: You are great, sir!