June 13, 2026
Explore
మాండవ్యా నదిపై చెక్‌డ్యాం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

మాండవ్యా నదిపై చెక్‌డ్యాం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

June 13, 2026 | Andhra Pradesh

రాయచోటిముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని మాండవ్యా నదిపై చెక్‌డ్యాం నిర్మాణానికి కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. జలధార –జలహారతి కార్యక్రమంలో భాగంగా రూ.2 కోట్ల వ్యయంతో నది పునర్‌తవ్వకం, చెక్‌డ్యాం నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

సీఎస్‌ఆర్, డీఎంఎఫ్ నిధులతో ఈ పనులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నది కంపచెట్లతో నిండిపోవడంతో పాటు లోతు తగ్గిపోవడంతో వర్షపు నీరు నిల్వ కాకుండా దిగువకు వెళ్లిపోతోంది. పునర్‌తవ్వకం, కొత్త చెక్‌డ్యాం నిర్మాణం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందనున్నాయని అధికారులు పేర్కొన్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Tags;Green signal for the construction of a check dam on the Mandavya River.