పుంగనూరుముచ్చట్లు:
మహిళలు సహకారం అందిస్తే అసాంఘిక కార్యక్రమాలను పూర్తిగా అణచివేస్తామని ఎస్‌ఐ కెవి.రమణ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పెంచుపల్లె , పట్టణంలోని బసవరాజ కళాశాలలో మహిళలపై అన్యాయాలు, మత్తుపదార్థాలు, జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలపై మహిళలకు అవగాహన సదస్సు కల్పించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రస్తుతం ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగిన మహిళలు తమకు సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం అందిస్తామన్నారు. అలాగే జూదం, గంజాయి వినియోగంపై కూడ తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


Tags; We will curb anti-social activities involving women.