June 8, 2026
Explore
మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలి

మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలి

June 8, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలని మామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరుకు వినతి పత్రం సమర్పించారు జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి మాట్లాడుతూక్రింది మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని,
ప్రభుత్వం 2026 సంవత్సరం మామిడి సీజన్ ప్రారంభమైన జిల్లాలోని మామిడి రైతులు మామిడిరైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపకపోవడం అత్యంత బాధాకరం అని చెప్పాడు..ప్రభుత్వం జిల్లాలోని మామిడి రైతులు మరియు గుర్తింపు పొందిన మామిడి రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి పెట్టుబడి ఖర్చులను నిర్ణయించి ప్రతి ఏటా వరుస నష్టాలతో కుదేలవుతున్న మామిడి రైతులకు,ఈ సంవత్సరమైనా పెట్టుబడి ఖర్చు తోతాపురి కేజీ 18 రూపాయలుగా నిర్ణయించి మామిడి రైతులకు రేటు ప్రకారం చెల్లించే విధంగా గుజ్జు ఫ్యాక్టరీలని ఆదేశించాలని కోరారు.ఈ 2026 వ సంవత్సరం చిత్తూరు జిల్లా కలెక్టర్ కిలో మామిడి తోతాపురికి 7 రూపాయలు గా నిర్ణయించారు.


గత 2025 సంవత్సరం ఇదే ప్రభుత్వం తోతాపూరి కిలో మామిడి కి కనీస పెట్టుబడి ఖర్చు 12 రూపాయలుగా నిర్ణయించారు దానికి భిన్నంగా ఈ 2026 సంవత్సరం పెరిగిన పెట్రోల్ డీజిల్ పెట్టుబడి ఖర్చులు అదనంగా చేరిన ప్రభుత్వం 50% ధర తగ్గించి నిర్ణయించడం అంటే ప్రభుత్వమే రైతుల్ని ఆర్థికంగా నష్టపోయే విధంగా ప్రోత్సహించడంప్రభుత్వం నిర్ణయించిన 7 రూపాయలు కూడా ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ప్రతి ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ దగ్గర ధర పట్టిక బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.జిల్లా స్థాయి అధికారులతో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని గతంలోని డిమాండ్ చేయడం జరిగిందని ఇప్పటివరకు ప్రభుత్వం ఆదేశిగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఇకనైనా ప్రభుత్వ స్పందించి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు.


జూన్ నెల ప్రారంభమైనా ఇంకా కొన్ని ప్రారంభించని గుజ్జు పరిశ్రమలు,ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల వద్ద కాయలను సేకరించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తరువాత జిల్లా ఉపాధ్యక్షులు ఉమాపతి నాయుడు.హేమలత మాట్లాడుతూఇప్పటికే కొన్ని ప్రారంభించిన గుజ్జు పరిశ్రమలు మెజారిటీ, ట్రేడర్స్ వద్ద తోతాపురి కాయలను లారీలలో దించుకుంటున్నారు,వీరు రైతుల వద్ద కూడా సేకరించేటట్లు తప్పక చర్యలు తీసుకోవాలని కోరారు
ఉపాధి హామీని మామిడి పంటకు పూర్తి అనుసంధానం చేయాలని కోరడం జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఇకనైనా ప్రభుత్వ స్పందించి మామిడికాయ అనుసంధానం చేయాలని కోరారు.గుజ్జు పరిశ్రమలు గత సంవత్సరం మామిడి రైతులకు ఇంకా ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేటట్లు చర్యలు తీసుకుని మామిడి రైతులకు ప్రత్యేక మ్యాంగో బోర్డు ను ఏర్పాటు చేయాలని అన్నారు.


పకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి ఏటా నష్టపోతున్న మామిడి రైతులకు వెంటనే నష్టపరిహారం ఇప్పించి
మామిడి పంటను కూడా పంటల బీమా పథకంలో చేర్చి పంటల భీమా వర్తింపజేయాలని మామిడి రైతులకు
డిజిటల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని అంటే ప్రతి రైతు పండించిన పంటని డిజిటల్ మార్కెట్ ద్వారా డైరెక్ట్ గా వ్యాపారస్తుడికి అమ్మే విధంగా చర్య తీసుకొని దళారీ వ్యవస్థను నియంత్రించాలని కోరారు.మామిడి రైతులకు ఎరువులు,పురుగు మందులతోపాటు పనిముట్లను 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలి.రాంపుల ఏర్పాటుకు అనుమతించిన ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీలలో ఇచ్చే రేటు రాంపులలో కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.22-12-2025.వ తేదీన మా సంఘం ద్వారా మీకు ఇచ్చిన పది రకాల సమస్యలను వెంటనే పరిష్కార దిశగా తప్పక చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరుకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సంజీవి.ఉమాపతి నాయుడు. బెల్లంకొండ శ్రీనివాసులు. హేమలత.చెంగల్రాయ. రాయ.త్యాగరాజు.తదితరులు పాల్గొన్నారు

Tags:The problems faced by mango farmers must be resolved.