– ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీ ముగింపు, ఆయుధాలు
– మొబైల్ ఫోన్ రికవరీ.
బీహార్‌లో మరో కీలక నిందితుడు (A-10) అరెస్ట్.
- వివరాలు వెల్లడించిన కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం.
- కరీంనగర్ ముచ్చట్లు:
న్యాయస్థానం ఆదేశాల మేరకు PMJ జువెలరీ షాప్ దారిదోపిడీ (Dacoity) కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. 03-06-2026 ఉదయం 11:00 గంటల నుండి 07-06-2026 ఉదయం 10:30 గంటల వరకు ఈ పోలీస్ కస్టడీ కొనసాగింది.
పోలీస్ కస్టడీలో విచారించిన నిందితుల వివరాలు:
A-1: సుబోధ్ సింగ్ (తండ్రి: ఈశ్వరి ప్రసాద్ సింగ్, నివాసం: చిష్టిపూర్ గ్రామం, చాందీ PS, నలందా జిల్లా, బీహార్)
A-2: రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్ (వయస్సు: 41 సం||, నివాసం: ఆసన్సోల్ సౌత్ PS, పశ్చిమ బర్ధమాన్ జిల్లా, పశ్చిమ బెంగాల్)
A-3: రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్ (వయస్సు: 23 సం||, నివాసం: హిల్సా మండల్, నలందా జిల్లా, బీహార్)
విచారణ విశేషాలు & రికవరీ:
పోలీస్ కస్టడీ సమయంలో పంచుల (సాక్షుల) సమక్షంలో నిందితులను సుదీర్ఘంగా విచారించగా, కీలకమైన ఆయుధాలు మరియు మొబైల్ ఫోన్ రికవరీ అయ్యాయి.
ఆయుధాల స్వాధీనం: నిందితులు A-2 మరియు A-3లు ఇచ్చిన సమాచారం మేరకు, వారిని వెంటబెట్టుకుని వెళ్ళగా… వెలిచాల బైపాస్ రోడ్ వద్ద గల చెట్ల పొదలలో దాచి ఉంచిన, నేరానికి ఉపయోగించిన రెండు (02) పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొబైల్ ఫోన్ స్వాధీనం: నిందితులు తప్పించుకుపోయిన మార్గమైన ధర్మపురి వైపు విచారణ జరపగా, మద్దునూరు గ్రామ పరిధిలోని బగ్గారం మండల అటవీ ప్రాంతం సమీపంలో నేరానికి సంబంధించిన ఒక Vivo కంపెనీ (వెండి –గులాబీ రంగు) మొబైల్ ఫోన్‌ను గుర్తించి, పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది.
నిందితుల అసహకారం – తప్పుదారి పట్టించే యత్నం:
విచారణలో కొంత సమాచారం సేకరించినప్పటికీ, నిందితులు పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరించలేదు.
దొంగిలించిన సొత్తు (బంగారు,వజ్రాల ఆభరణాలు) ఎక్కడ దాచారు? ఎవరికి విక్రయించారు? ఎవరెవరికి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? అనే కీలక సమాచారాన్ని నిందితులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు.
ఆభరణాల దాచివేత, రవాణా విషయాలపై నిందితులు పరస్పర విరుద్ధమైన, తప్పుదారి పట్టించే వాంగ్మూలాలు ఇచ్చారు.
ముఖ్యంగా, గతంలో గుండాల అటవీ ప్రాంతంలో సొత్తు దాచినట్లు చెప్పిన A-2 (రఘునాథ్ కర్మాకర్), ఇప్పుడు ఆ సమాచారం నుండి వెనక్కి తగ్గాడు. కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడానికే నిందితులు ఇలా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో, నిందితులను మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గౌరవ న్యాయస్థానంలో ప్రత్యేకంగా రిక్విజిషన్ (Requisition) దాఖలు చేయనున్నారు.
పరారీలో ఉన్న మరో కీలక నిందితుడి (A-10) అరెస్ట్:
ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ బృందం ఒక భారీ విజయాన్ని సాధించింది.
అరెస్ట్ వివరాలు: తేది: 04-06-2026 న బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లాలోని సలింపూర్‌లో A-10 నిందితుడైన అమర్‌సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర కుమార్ సింగ్ (తండ్రి: దివంగత రమేశ్వర్ సింగ్, వయస్సు: 43 సం., నివాసం: రూపాస్ మహాజీ, సలింపూర్ PS) ను పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. నిందితుడిని అక్కడ స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరిచి, కరీంనగర్‌కు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడానికి పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ (Transit Warrant) పొందారు. ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందం నిందితునితో కలిసి కరీంనగర్‌కు ప్రయాణంలో ఉన్నది.ఈ కేసులోని మిగిలిన పరారీ నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని సీపీ గౌష్ ఆలం తెలిపారు.
Tags:PMJ Jewellery shop robbery case