పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండ్ వద్ద గల పురాతనమైన శ్రీ బోగనంజుండేశ్వరస్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు దేవాదాయశాఖ సిజిఎఫ్ క్రింద రూ.52 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో ప్రజలవాటా రూ.10.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ ఆలయానికి ప్రజలు స్వతంత్రంగా తమ శక్తి మేరకు రూ.10.40 లక్షలు విరాళాలు చెల్లించారు. త్వరలోనే ఆలయ గోపురం, ధ్వజస్తంభం, ప్రాకారం, ప్రహారీ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా పురాతనమైన ఆలయాన్ని వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో దేవాదాయశాఖ పరిధిలోకి చేర్చి , అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
Tags;Rs. 52 lakhs for Sri Bogananjundeswara Swamy Temple