June 8, 2026
Explore
శ్రీ మాణిక్యవరదరాజస్వామి ఆలయాన్ని టీటీడీలోకి చేర్పించాలి

శ్రీ మాణిక్యవరదరాజస్వామి ఆలయాన్ని టీటీడీలోకి చేర్పించాలి

June 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కోట్లాది రూపాయలు ఆస్తులు కలిగిన శ్రీ మాణిక్యవరదరాజస్వామి ఆలయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానం వారు స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ప్యాలెస్‌ ఆవరణం ప్రారంభంలో శ్రీ మాణిక్యవరదరాజస్వామి ఆలయాన్ని రెండు శతబ్దాల క్రితం జమీందారులు నిర్మించారు. స్వామివారి కైంకర్యాల కోసం మండలంలోని గోపిశెట్టిపల్లె, మేలుపట్ల గ్రామాల్లో సుమారు 200 ఎకరాల భూములను ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఇలా ఉండగా ఆలయం శిధిలావస్థకు చేరుతుండగా రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2014 సంవత్సరంలో దేవాదాయశాఖ ద్వారా ఆలయ నిర్మాణాలకు రూ.2 కోట్ల రూపాయలు విడుదల చేయించి, ప్రహారి, గోపురం, ఆలయంలో పనులు చేయించారు. ప్రస్తుతం ఆలయ ఆదాయం ఏటా రూ.20 లక్షల రూపాయలు వస్తోంది. ఎన్‌ఎస్‌.పేట వద్ద గల కొంత భూమిని రూ. 2 కోట్లకు విక్రయించారు. దానిని బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. దాని ద్వారా కూడ ఆదాయం లభిస్తోంది. వీటిని ఆలయంలో పూజా కైంకర్యాలు, సిబ్బంధి జీత భత్యాలకు వినియోగించుకోవాల్సి ఉంది. కానీ ఆలయంలో ఉదయం, సాయంత్రం పూజలు మాత్రం సజావుగా సాగిస్తున్నారు. మిగిలిన ఉత్సవాలు, తేరు జరపడం లేదు. శ్రీవారి ఉత్సవ ఖర్చుల కోసం ఏర్పాటు చేసిన పశువుల పరుష మాత్రం నిర్వహిస్తున్నారు. కానీ శ్రీవారి ఉత్సవాలు జరగడం లేదు. తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలను సైతం టీటీడీ పరిధిలోకి చేర్చుకున్నారు. కానీ కోట్లాది రూపాయలు ఆస్తులు, ఆదాయం కలిగిన శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయాన్ని కూడ టీటీడీ స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కాగా సుమారు 20 సంవత్సరాలుగా ఆలయానికి కమిటి లేకపోవడం, బోయకొండ డీసీగా ఉన్న ఏకాబంరం ఈ ఆలయానికి కూడ ఇన్‌చార్జ్ ఈవోగా ఏళ్ల తరబడి కొనసాగుతుండటం సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది.

Tags: The Sri Manikyavaradaraja Swamy Temple should be brought under the administration of TTD.