June 8, 2026
Explore
వీఆర్‌వో ఆత్మహత్య పై నిరసనలు

వీఆర్‌వో ఆత్మహత్య పై నిరసనలు

June 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కర్నూల్‌ జిల్లా వెంకయ్యపాళెం వీఆర్‌వో మహమ్మద్‌హుసేన్‌ య్ధికారుల ఒత్తిడికి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై స్థానిక వీఆర్‌వోలు నిరసన తెలిపారు. సోమవారం సంఘ అధ్యక్షుడు అక్భర్‌ ఆధ్వర్యంలో వీఆర్‌వోలు తహశీల్ధార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వీఆర్‌వోలకు పనిభారం తీవ్రమై, అధికారుల ఒత్తిడి ఎక్కువైందని ఆరోపించారు. వీఆర్‌వోలకు పనిభారం తగ్గించాలని, మృతి చెందిన వీఆర్‌వో కుటుంభాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వోలు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Protests over VRO’s suicide