టి.సుండుపల్లి ముచ్చట్లు:
టి.సుండుపల్లి మండలంలోని నక్కలనార్వ గిరిజన కాలనీ వెనుక ఉన్న ప్రభుత్వ చెరువు భూమి ఆక్రమణకు గురైందంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. సర్వే నెం. 29/1లో సుమారు ఎకరం మేర ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు ఆక్రమించి కంచె ఏర్పాటు చేసి చెట్లు నాటుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి అది ప్రభుత్వ భూమేనని నిర్ధారించినప్పటికీ, ఇప్పటికీ ఆక్రమణ కొనసాగుతోందని ఆరోపించారు. అంతేకాకుండా ఆ భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
Tags: Complaint lodged with the Collector regarding encroachment on government tank land.