June 8, 2026
Explore
కలికిరిలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

కలికిరిలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

June 8, 2026 | Andhra Pradesh

కలికిరి ముచ్చట్లు:

కలికిరి మండలం గుండ్లూరులో జరుగుతున్న మూలస్థానం తిరుణాళ్ల సందర్భంగా సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. రంగనాథపురం గ్రామానికి చెందిన వెంకటమ్మ (80) రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ మంజునాథ్, పైలట్ సీటీఎం రమణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.

Tags: Elderly woman critically injured after being hit by an RTC bus in Kalikiri.