June 8, 2026
Explore
బి.కొత్తకోటలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

బి.కొత్తకోటలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

June 8, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గట్టు గ్రామం, పట్రవారిపల్లెకు చెందిన మల్లీశ్వరి (38), తస్లీమ్ (38)తో పాటు మరో ఐదుగురు ఆటోలో బి.కొత్తకోటకు వెళుతుండగా గుమ్మసముద్రం చెరువు సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురిని బి.కొత్తకోట ఆసుపత్రికి, మల్లీశ్వరి, తస్లీమ్‌లను మెరుగైన చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: Road accident in B. Kothakota; seven sustain severe injuries.