June 8, 2026
Explore
లక్కిరెడ్డిపల్లి వద్ద బొలేరో ఢీకొని 15 గొర్రెల మృతి

లక్కిరెడ్డిపల్లి వద్ద బొలేరో ఢీకొని 15 గొర్రెల మృతి

June 8, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:

లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల దాసిరెడ్డి మిట్ట సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెలు మృతి చెందాయి. సంబేపల్లి నుంచి గొర్రెలను తోలుకెళ్తున్న కాపరులను ప్రొద్దుటూరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. వాహనదారుడి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనతో గొర్రెల కాపరులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Tags; 15 sheep killed after being hit by a Bolero near Lakkireddypalli.