చిట్వేల్ ముచ్చట్లు:
చిట్వేల్ మండలం కేఎస్ అగ్రహారం మామిడికాయల యార్డు వద్ద సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఫుల్ లోడ్ మామిడికాయల లారీ వెనుక టైరు కింద మొట్టగారి ఈశ్వరయ్య (38) నిద్రిస్తుండగా, అది గమనించని డ్రైవర్ లారీని యార్డుకు తరలించేందుకు స్టార్ట్ చేశాడు. దీంతో లారీ చక్రాల కింద నలిగిన ఈశ్వరయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Man crushed to death under lorry wheels