June 6, 2026
Explore
మానసిక వికలాంగ బాలిక పై పలు మార్లు అత్యాచారం…యువకుడిపై పోక్సో కేసు నమోదు

మానసిక వికలాంగ బాలిక పై పలు మార్లు అత్యాచారం…యువకుడిపై పోక్సో కేసు నమోదు

June 6, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

తుమ్మలచెరువు గ్రామానికి చెందిన యువకుడు, మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం చేశాడు.

బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు శుక్రవారం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, ఎస్సై డి.శివనాగరాజు పోక్సో కేసు నమోదు చేశారు.

గురజాల డీఎస్పీ మహేశ్వరరావు ఈ కేసుపై విచారణ చేపట్టారు.

బాలికను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags:Mentally challenged girl raped multiple times… POCSO case registered against a young man.