June 6, 2026
Explore
చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు

చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు

June 6, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అల్లనేరేడు చెట్టుపై నుంచి పడి ఓ రైతు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నేతిగుట్లపల్లె (అరంట్లపల్లి)కి చెందిన రైతు శ్రీరాములు (50) తన వ్యవసాయ పొలంలోని అల్లనేరేడు చెట్టు ఎక్కి కాయలు కోస్తున్నాడు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి పైనుంచి కింద పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags: Farmer suffers severe injuries after falling from a tree.