అన్నమయ్య ముచ్చట్లు:
రవాణా వాహనదారులు తమ త్రైమాసిక, వార్షిక పన్నులను కేంద్ర ప్రభుత్వ ‘పరివాహన్’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా చెల్లించుకోవచ్చని అన్నమయ్య జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్ రావు తెలిపారు. అన్నమయ్య కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పన్ను చెల్లింపు విధానంపై రవాణా శాఖ ఒక ప్రత్యేక అవగాహన వీడియోను రూపొందించింది. ఈ వీడియో ద్వారా వాహనదారులు ఇతరులపై ఆధారపడకుండా మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా స్వయంగా పన్ను ఎలా చెల్లించాలో దశలవారీగా తెలుసుకోవచ్చన్నారు. డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం వల్ల సమయం, ఖర్చు ఆదాతో పాటు మధ్యవర్తుల అవసరం తప్పుతుందని, సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఈ వీడియోను చూసి వాహనదారులు సకాలంలో పన్నులు చెల్లించాలని ఆయన సూచించారు.
Tags: Payment of vehicle taxes online