June 5, 2026
Explore
ఇంట్లో దుర్వాసన.. చూస్తే మగ్గాల నిర్వాహకుడి మృతదేహం

ఇంట్లో దుర్వాసన.. చూస్తే మగ్గాల నిర్వాహకుడి మృతదేహం

June 5, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె లోని స్థానిక నీరుగట్టుపల్లి చౌడేశ్వరి గుడి రెండో వీధిలో ఓ ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో పరిశీలించగా.. మగ్గాల నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించినట్లు టౌన్ సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు.

పోలీసుల వివరాల మేరకు.. రాయచోటి బట్లపల్లికి చెందిన బి. జయరాం (37) 20 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చి స్థిరపడి మగ్గాలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల భార్యతో గొడవపడటంతో ఆమె అలిగి ఎలాహంకకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన జయరాం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఇరుగుపొరుగు వారు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Tags: Foul smell in the house… Loom operator’s body found.