నందూస్ వరల్డ్’ దంపతులపై కేసు.. ‘విమెన్’ విక్టిమ్ కార్డు
యూకే ముచ్చట్లు:
కేసు నమోదు కాగానే ‘విమెన్’ అనే విక్టిమ్ కార్డు ఉపయోగిస్తూ, సానుభూతి కోసం మోసపోయిన వారినే హేళన చేస్తూ వీడియోలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్‌పై వచ్చిన మోసం ఆరోపణలు సంచలనంగా మారాయి.
గుంటూరుకు చెందిన ఈ దంపతులు ప్రస్తుతం యూకే (లండన్) లో నివసిస్తున్నారు. రమానందన ‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు.
ఈ పాపులారిటీని ఉపయోగించుకుని, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసి, విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామని చెప్పి కార్యకలాపాలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి
ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్‌లో చదువుకునే రోజుల్లో మధుకర్‌తో పరిచయం ఏర్పడింది.
లండన్‌లో ఉద్యోగం చేసి భారత్‌కు వచ్చిన శివ క్రాంతి కుమార్.. వీసా రెన్యూవల్, భార్యకు ఉద్యోగం కోసం CoS ఇప్పిస్తామని చెప్పిన మధుకర్‌ను ఆశ్రయించారు.
దీని కోసం రూ.15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించగా, 2023లో శివ క్రాంతి కుమార్ నిందితులు తెలిపిన రెండు బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు.
బాధితుడు శివ క్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబరులోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.
ఈ కేసులో మధుకర్ (A1), రమానందన (A2), మోహన్‌రావు (A3)గా పోలీసులు నమోదు చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ నిందితుల నుంచి స్పందన రాలేదని సమాచారం.కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం పిటిషన్ విచారణలో ఉంది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బాధితులమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెరుగుతున్నాయి.
ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags:Massive collections in the UK in the name of jobs