June 2, 2026
Explore
హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సహా నలుగురు యువకుల అరెస్ట్

హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సహా నలుగురు యువకుల అరెస్ట్

June 2, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సహా నలుగురు యువకులను పాతగుంటూరు పోలీసులు మాదకద్రవ్యాలు సేవిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. నందివెలుగు రోడ్డులోని రైల్వే ట్రాక్ సమీపంలో కొందరు యువకులు ఎండీఎంఏ మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో, సీఐ వెంకటప్రసాద్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని పాలవాయి హరికృష్ణ, మిరియాల సాయితేజ, బాదినేడి నాగార్జున, కొమ్మూరి సాయిప్రకాశ్‌లను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి సుమారు 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశామని అన్నారు.

Tags: Four Youths, Including Head Constable’s Son, Arrested