మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలం చిన్న తిప్ప సముద్రం చెరువులు యువకుడు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. CTM కొత్తపేటకు చెందిన బాలాజీ చిన్నతిప్ప సముద్రం చెరువుకు బట్టలు ఉతకను ఆదివారం వెళ్లి పొరపాటున లోతునీటిలోకి పడి మునిగిపోయాడు. కుటుంబీకులు కేకలు వేయడంతో స్థానికులు తాలూకా పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప ఫైర్ సిబ్బందితో వెళ్లి చెరువులో వెతుకుతున్నారు.
Tags; Young Man Goes Missing in C-Team Big Tank