చిలకలూరిపేట ముచ్చట్లు:
గతంలో కదిరి డీఎస్పీగా పని చేసిన గ్రూప్-1 2018 బ్యాచ్ అధికారి సలికినిడి భవ్య కిషోర్‌కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. విధి నిర్వహణలో ప్రతిభ విధుల్లో చూపిన అంకితభావం, ప్రతిభకు గుర్తింపుగా ఈ పదోన్నతి దక్కిందని అధికారులు తెలిపారు. మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ ప్రస్తుతం ఆమె మెటర్నిటీ సెలవులో ఉన్నారు. సెలవులు ముగిసిన అనంతరం మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేలూరు ప్రజల హర్షం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన పోలీస్ అధికారి ఏఎస్పీగా పదోన్నతి పొందడం గ్రామానికి గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భవ్య కిషోర్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.
Tags: Group-1 Officer Bhavya Kishore Promoted to ASP