గుజరాత్ ముచ్చట్లు:
నీ సెల్లు లో నీ చూపు తగలెయ్య….నడి రోడ్డు మీద నీ పరధ్యానం ఏందయ్యా సెల్ మాయ లో పడ్డాడు …
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో పట్టపగలే చోరీ ఘటన కలకలం రేపింది.
రద్దీగా ఉండే మానెక్ చౌక్ ప్రాంతంలో ఓ బులియన్ వ్యాపారి ఉద్యోగి ఫోన్ చూస్తూ ఉండగా, అతని అజాగ్రత్తను ఆసరాగా చేసుకున్న దొంగ కేవలం కొన్ని సెకన్లలో రూ.5.50 లక్షల నగదును దోచుకొని పరారయ్యాడు.
ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
సినిమా సన్నివేశాన్ని తలపించేలా జరిగిన ఈ చోరీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Tags; The guy next to me swiped the money from my bag!