తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో టీటీడీ కీలక మార్పులు చేసింది. రోజుకు 1500 టికెట్లను ఆన్లైన్, కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేయనుంది. రూ.10 వేల విరాళం ఇచ్చి వేచి ఉన్న దాతలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ప్రత్యేక కోటా విడుదలవుతుంది. జూన్ 10 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ 500, తిరుపతి ఎయిర్ పోర్ట్లో 200, కరెంట్ బుకింగ్లో 800 టికెట్లు ఇవ్వనున్నారు.
Tags: Changes in the Allocation of Tirumala Srivari Darshan Tickets