May 29, 2026
Explore
ఫైనల్ బెర్త్ కోసం ‘టైటాన్స్’ వర్సెస్ ‘రాయల్స్’ పోరు!

ఫైనల్ బెర్త్ కోసం ‘టైటాన్స్’ వర్సెస్ ‘రాయల్స్’ పోరు!

May 29, 2026 | Andhra Pradesh

నేడే ఐపీఎల్ క్వాలిఫైయర్-2 సమరం.

చండీగఢ్‌లో గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ ఢీ.

గెలిచిన జట్టుతో ఫైనల్లో బెంగళూరు (RCB) ఫైట్.

అమరావతిముచ్చట్లు:

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లో మే 31న జరిగే మహా సంగ్రామానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే క్వాలిఫైయర్-1 గెలిచి ఫైనల్ చేరగా,ఆ జట్టుతో తలపడే రెండో జట్టు ఎవరో తేల్చేందుకు నేడు క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు ఈ రాత్రి 7:30 గంటలకు హోరాహోరీగా తలపడనున్నాయి.

కసితో టైటాన్స్.. జోరులో రాయల్స్!

క్వాలిఫైయర్-1లో బెంగళూరు చేతిలో 92 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు,ఫైనల్ చేరడానికి ఇది రెండో అవకాశం. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ ఈ సీజన్లో 600కు పైగా పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండగా… బౌలింగ్‌లో కాగిసో రబాడ,సిరాజ్, జేసన్ హోల్డర్లపై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది.

మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసి రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ముఖ్యంగా కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లతో 97 పరుగులు చేసిన 15 ఏళ్ల సంచలన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రాయల్స్ జట్టుకు ప్రధాన బలమయ్యాడు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ అదిరిపోయే ఫామ్‌లో ఉండి ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతున్నాడు.

హెడ్-టు-హెడ్ రికార్డు

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య జరిగిన గత 10 మ్యాచ్‌లను పరిశీలిస్తే గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పైచేయి సాధించింది. అయితే చండీగఢ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ఆడిన గత 4 మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేకుండా అజేయంగా దూసుకుపోతుండటం విశేషం.టాస్ గెలిచిన జట్టు ఇక్కడ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది…

Tags: Titans’ vs ‘Royals’: The Battle for a Spot in the Final!