May 29, 2026
Explore
జూన్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు

జూన్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు

May 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • జూన్ 05, 12, 19, 26 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం
  • జూన్ 04న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
  • జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు

శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..

  • జూన్ 23న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో…

  • జూన్ 09న శ్రీ సుందరరాజ స్వామివారు రాత్రి 07.00 గంటలకు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో..

  • జూన్ 14న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 07.00 గం.లకు శ్రీ కృష్ణ స్వామివారికి తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.

శ్రీ శ్రీనివాస ఆలయంలో..

  • జూన్ 06, 13, 20, 27 తేదీలలో శనివారం సందర్భంగా ఉదయం 08.00 గం.లకు అభిషేకం.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు….

  • జూన్ 05, 12, 19 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.
  • జూన్ 02న ఉదయం 08.00 గం.లకు అష్టదళ పాదపద్మారాధన
  • జూన్ 05 ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం
  • జూన్ 10న అష్టోత్తర శత కలశాభిషేకం
  • జూన్ 25 నుండి జూలై 03వ తేదీ వరకు శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు,
    -జూన్ 23న ఉదయం 08.00 – 10.30 గం.ల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 24న సాయంత్రం 6.30 గం.లకు అంకురార్పణ, జూన్ 25న ఉదయం 08.30 గం.లకు ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహనం.
  • జూన్ 07, 14, 21, 28న ఆదివారం రోజులలో శ్రీ ఆంజనేయ స్వామి వారి మూలవర్లకు ఉదయం 08.15 గం.లకు అభిషేకం

Tags: Details of Special Festivals at the Sri Padmavathi Ammavari Temple, Tiruchanur, in the Month of June