May 19, 2026
Explore
‘డ్రగ్స్ పై దండయాత్ర

‘డ్రగ్స్ పై దండయాత్ర

May 19, 2026 | Andhra Pradesh

  • ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించిన రేణిగుంట పోలీసులు.
  • ▫️ గంజాయి విక్రేతలు, వినియోగదారుల కదలికలపై ప్రత్యేక నిఘా.
  • ▫️ ‘బయో-చెక్’ కిట్ల ద్వారా అనుమానితులకు డ్రగ్ టెస్టులు.
  • ▫️ గంజాయి నెట్‌వర్క్‌పై ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ లింకుల గుర్తింపు.
  • ▫️ డ్రగ్స్‌కు బానిసైన వారికి కౌన్సిలింగ్ మరియు పునరావాస సదుపాయాలు.
  • ▫️ గంజాయి రహిత సమాజ స్థాపనే పోలీస్ శాఖ లక్ష్యం.
  • తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో గంజాయి విక్రేతలు మరియు వినియోగదారుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు.‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రేణిగుంటలో గంజాయి అలవాటు ఉన్న అనుమానితులకు ప్రత్యేక ‘బయో-చెక్’ కిట్ల ద్వారా డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీఎస్పీ శ్రీనివాసరావు , గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు, గంజాయి విక్రయించే పెడ్లర్లు, అలాగే వినియోగదారుల వివరాలను సేకరించి వారిని పిలిపించి ఎన్టీఆర్ కూడలి వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను ‘బయో-చెక్’ కిట్ల ద్వారా పరీక్షించి గంజాయి వినియోగిస్తున్నారా లేదా అనేది నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి ద్వారా గంజాయి నెట్‌వర్క్‌కు సంబంధించిన ఫార్వర్డ్ మరియు బ్యాక్‌వర్డ్ లింకులను గుర్తించి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.గంజాయికి బానిసలైన వారిని ఆ అలవాటు నుంచి దూరం చేసేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతితో కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు.పాపానాయుడుపేటలోని ‘రాస్’ పునరావాస కేంద్రం, అలాగే స్విమ్స్ మరియు రుయా ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వారికి పునరావాస సేవలు అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని వివరించారు.సమాజంలో గంజాయి మహమ్మారిని నిర్మూలించేందుకు ఇలాంటి తనిఖీలు మరియు డ్రగ్ పరీక్షలు నిరంతరం కొనసాగుతాయని, గంజాయి రహిత సమాజ స్థాపనే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రేణిగుంట సీఐ జయచంద్ర మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: War on Drugs