పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో జూలై 11న జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. మంగళవారం న్యాయమూర్తులు పరేష్‌కుమార్, కృష్ణవంశితో కలసి ఆమె న్యాయవాదులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 11న కోర్టు ఆవరణంలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదులు, అధికారులు, కక్షిదారులు కలసి అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమైయ్యేందుకు కృషి చేయాలని , లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Tags: Lok Adalat on July 11