పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద గల ఐటిఐ కళాశాలలో వివిధ రకాల కోర్సుల్లో అడ్మీషన్లు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానికల్, సివిల్, మెకానికల్ డీజల్, ఫ్యాషన్‌డీజైన్ కోర్సుల్లో అడ్మీషన్లు నిర్వహిస్తామన్నారు. పదోతరగతి పాస్, ఇంటర్‌పాస్, లేదా పెయిల్ విద్యార్థులు , వెల్డర్ శిక్షణకు పదోతరగతి పెయిల్ అయిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30 వ తేదీలోపు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.
Tags: Apply for admissions at ITI.