May 19, 2026
Explore
కోడూరులో మూడు కార్లు దగ్ధం

కోడూరులో మూడు కార్లు దగ్ధం

May 19, 2026 | Andhra Pradesh

రైల్వే కోడూరు ముచ్చట్లు:

రైల్వే కోడూరు మండలం బాలపల్లి ప్రధాన రహదారి పై జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు కార్లు దగ్ధమయ్యాయి. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ముగ్గురు స్వల్ప గాయాలపాలయ్యారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న మరో కారులో అకస్మాత్తుగా పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని అక్కడే ఆపి బయటకు దిగిపోయాడు. అనంతరం కొద్దిసేపట్లోనే మూడు వాహనాలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Tags:Three cars gutted by fire in Koduru.