చౌడేపల్లె ముచ్చట్లు:
చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయం కు హుండీ లెక్కింపు ద్వారా రూ.1.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో ఏకాంబరం తెలిపారు.సోమవారం హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,01,85,400 నగదు, 29.400 గ్రాముల బంగారం, 466 గ్రాముల వెండి, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ లభించిందన్నారు. గత 54 రోజులలో భక్తుల నుంచి ఈ ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో జిల్లా దేవాదాయశాఖ ఏసీ విశ్వనాథ్, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
Tags: Boyakonda Gangamma Temple Generates ₹1.01 Crore in Hundi Revenue