గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండలం గోరంచెరువు పంచాయతీ ఆవులశెట్టివారిపల్లెలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవత ఆలయం కు చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
గ్రామానికి చెందిన 49 కుటుంబాలు 2019లో 11 సెంట్ల భూమిని ఆలయానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు తెలిపారు. అయితే కొందరు నాయకులు ఆ భూమిని రాయచోటికి చెందిన వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
సోమవారం భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నట్లు చెప్పారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేసి ఆలయ భూమిని రక్షించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.
Tags: Villagers Outraged Over Encroachment of Goddess Chowdeshwari’s Land