May 19, 2026
Explore
గుడి వివాదంతో ఇరువర్గాల ఘర్షణ.. 16 మందికి గాయాలు

గుడి వివాదంతో ఇరువర్గాల ఘర్షణ.. 16 మందికి గాయాలు

May 19, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో గుడి నిర్మాణ వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి 16 మంది గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీపురానికి చెందిన రెడ్డెమ్మ బీటీ కళాశాల మైదానం ఎదురుగా ఉన్న స్థలంలో ఓం శక్తి అమ్మవారి ఆలయం నిర్మించగా, అదే దారిలో కుమారపురం వాసులకు చెందిన కట్టకింద గంగమ్మ ఆలయం ఉండటంతో వివాదం నెలకొంది.

సోమవారం ఆలయానికి సంబంధించిన ఇనుప తలుపులు తీసుకురావడాన్ని మరో వర్గం అడ్డుకోవడంతో మాటామాటా పెరిగి పరస్పర దాడులకు దారితీసింది. ఘటనలో ఇరువర్గాలకు చెందిన 16 మంది గాయపడ్డారు.సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Tags: Clash between two factions over temple dispute; 16 injured.