May 19, 2026
Explore
వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

May 19, 2026 | Andhra Pradesh

సగటున లీటర్‌పై 90 పైసలు పెంపు

అంతర్జాతీయ మార్కెట్లో 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్

హైదరాబాద్‌లో 99 పైసలు పెరిగి రూ.111.88కి చేరిన పెట్రోల్‌

ఢిల్లీలో రూ.98.64, ముంబయిలో రూ.107.59కి చేరిన పెట్రోల్

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్లే చమురు మార్కెట్లో ఒడిదొడుకులు

హైదరాబాద్‌ ముచ్చట్లు:

తాజా సవరణ ప్రకారం.. దేశవ్యాప్తంగా సగటున లీటర్‌ పెట్రల్‌, డీజిల్‌పై 90 పైసలు పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ఈ పెంపులో స్వల్ప తేడాలుంటాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 99 పైసలు పెరిగి రూ.111.88కి చేరింది. డీజిల్‌ ధర సైతం 99 పైసలు ఎగబాకి రూ.99.95గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి రూ.98.64కి చేరింది. అలాగే డీజిల్ ధర 91 పైసలు పెరిగి రూ.91.58గా నమోదైంది. కోల్‌కతాలో 96 పైసలు పెరగడంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.109.70కి చేరింది. ముంబయిలో 91 పైసలు పెరిగి రూ.107.59కి, చెన్నైలో 82 పైసలు పెరిగి రూ.104.49కి పెట్రోల్ రేట్లు చేరుకున్నాయి.

పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. కోల్‌కతా, ముంబయి నగరాల్లో లీటర్‌ డీజిల్‌పై 94 పైసల చొప్పున పెరిగింది. దీనితో కోల్‌కతాలో డీజిల్ ధర రూ.96.07కి, ముంబయిలో రూ.94.08కి చేరింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా నిలిచిపోతుందనే ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 100 డాలర్ల మార్కును దాటేసింది. ఈ ప్రభావమే దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది

Tags: Shock for Motorists: Petrol and Diesel Prices Rise Again