May 19, 2026
Explore
గ్రామ కంఠాల్లోని ఇళ్లు, వారసత్వ స్థలాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్

గ్రామ కంఠాల్లోని ఇళ్లు, వారసత్వ స్థలాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్

May 19, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ కంఠాల్లోని ఇళ్లు, వారసత్వంగా వచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో గ్రామ కంఠంగా నమోదై నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లకైనా..,

ఇంటి పన్ను లేదా ఖాళీ స్థల పన్ను రశీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి కల్పించింది.

ఇందుకు లింకు డాక్యుమెంట్లు, ఇతర ధ్రువపత్రాలు తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధి పొందనున్నారు.

Tags: Green Signal for the Registration of Houses and Inherited Properties in Village Habitation Areas