May 18, 2026
Explore
మదనపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం పక్కనే ఇరు వర్గాల ఘర్షణ

మదనపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం పక్కనే ఇరు వర్గాల ఘర్షణ

May 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, మదనపల్లె కుమారపురం వద్ద సోమవారం గుడివివాదం తలెత్తి ఇరు వర్గాలు బీకరంగా కొట్టుకున్నారు. గుడి అడ్డంగా ఉందని ఒకవర్గం, ఇక్కడ గుడి ఎన్నో ఏళ్లుగా ఉందని మరో వర్గం ఒకరిపై మరొకరు విచక్షణ రహితంగా కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఘర్షణ సమాచారం అందుకున్న 1వ పట్టణ పోలీసులు వెంటనే ఘటన స్థలం వద్దకు చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పి, గాయపడ్డవారిని జిల్లా అస్పత్రికి తరలించారు.

Tags: Clash between two factions right next to the Madanapalle District SP’s office.